
రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్టాడు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్డాడని, తాను జోక్యం చోసుకుని తెలుగును ఇంగ్లీష్‌లోకి అనువాదం చేస్తానని అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్‌కు చెప్పిన విషయాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్ధీవదేహానికి వెంకయ్య నాయుడు నివాళులుల అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
అనంతరం వెంకయ్య మాట్లాడుతూ..తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ బ్రతికాడని కొనియాడారు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేశాడని వ్యాఖ్యానించారు. అనుకున్న పనిని తనదైన శైలిలో చేసిన వ్యక్తి హరికృష్ణ అని, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ తనయుడిగా హరికృష్ణ వ్యవహరించారని పేర్కొన్నాఉ. తన కుటుంబానికి , హరికృష్ణ మరణం తీరని లోటని అన్నారు.