‘అన్ని సర్వేల్లోనూ ప్రజా కూటమిదే విజయం’

Uttam Kumar Reddy Says People Front Will Be Win In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల్లో ప్రజాకూమిదే గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెపుతున్నాయి.. ఈ 15 రోజులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే కూటమిదే విజయమని టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఇక కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు, కేటీఆర్‌ అమెరికాకు పోవాల్సి వస్తదని ఎద్దేవా చేశారు. దోచుకున్న డబ్బుతో ఎన్నికను ప్రభావితం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ మాజీ అయిపోయాడని, ఇక మాజీగానే ఆయన ఉంటారని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు.

మేడ్చల్‌ సభతో తెలంగాణలో కీలక మార్పులు
ఈ నెల 23న కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని ఉత్తమ్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు వారు బేగంపేటకు చేరుకొని కారు ప్రయాణం ద్వారా మేడ్చల్ చేరుకుంటారని చెప్పారు. సాయంత్రం 5 నుంచి 6గంటలకు బహిరంగ సభలో ప్రసంగం ఉంటుందన్నారు. కార్యకర్తలు అందరూ సోనియా, రాహుల్‌కు స్వాగతం పలుకాలని కోరారు. ప్రతి ఒక్కరిని సభకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో కీలకమార్పులు జరుగనున్నాయని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top