టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌పై ట్విస్ట్‌

Twist For TRS Candidate Rekha Nayak Nomination - Sakshi

రేఖానాయక్‌ నామినేషన్‌పై ఉత్కంఠ

తిరస్కరించాలని ప్రతిపక్షాల డిమాండ్‌

సాక్షి, నిర్మల్‌ : జిల్లాలోని ఖానాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేఖానాయక్‌ దాఖలు చేసిన నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. గత బుధవారం ఆమె మూడు సెట్లు నామినేషన్‌ పత్రాలు రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. అయితే మూడు సెట్లలోని ఒక కాలమ్‌ను ఖాళీగా ఉంచారు.  దీంతో రిటర్నింగ్‌ అధికారి ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఉట్నూరుకు చెందిన రితేష్‌ రాథోడ్‌ అనే వ్యక్తి రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రతిపక్షాలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రేఖానాయక్‌ నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top