పల్లెల్లో షి‘కారు’ 

TRS Party Is Winning Josh  In Khammam - Sakshi

జిల్లాలో కారు జోరు సాగింది. పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయదుందుభి మోగించింది. అప్రతిహతంగా విజయపరంపర కొనసాగించింది. అత్యధిక మెజార్టీతో లోక్‌సభ స్థానాన్ని దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ అదే హవాను కొనసాగించి 17 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకుంది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠాన్ని తన ఖాతాలో వేసుకుంది. మండల పరిషత్‌లలోనూ పాగా వేయనుంది. ప్రజలు ఇంతటి విజయాన్ని అందించడంతో జిల్లాలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులన్నీ సంబరాల్లో మునిగిపోయాయి.

సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లా పరిషత్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుంది. 20 జెడ్పీటీసీ స్థానాలకుగాను.. 17 స్థానాల్లో విజయం సాధించింది. జిల్లా పరిషత్‌ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి సాధారణంగా 11 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా.. టీఆర్‌ఎస్‌ 17 స్థానాల్లో గెలుపొందడంతో జెడ్పీ స్థానాన్ని ఆ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 8 గంటలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి కావడానికి ఆలస్యమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలో ఎన్నికలు జరిగిన అన్ని ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడగా.. జెడ్పీటీసీ ఫలితాలు వెలువడేందుకు సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆయా పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

జిల్లాలో 289 ఎంపీటీసీ స్థానాలకుగాను.. 6 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 283 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. అత్యధిక స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష స్థానాలను(ఎంపీపీ) సైతం అత్యధికంగా టీఆర్‌ఎస్‌ పార్టీనే కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో హవా కొనసాగించిన కాంగ్రెస్‌.. పంచాయతీ ఎన్నికల్లో కొంత వరకు తన బలాన్ని పదిల జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా లింగాల కమల్‌రాజు? జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను గెలుపొందిన టీఆర్‌ఎస్‌ ఇక జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ఎంపికపై దృష్టి సారించింది.

ఎస్సీ జనరల్‌ స్థానానికి రిజర్వు అయిన ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి మధిర జెడ్పీటీసీ స్థానం నుంచి గెలుపొందిన లింగాల కమల్‌రాజుకు దాదాపు ఖాయమైందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మధిర నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. దీంతో ఆయన మధిర జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా అవకాశం ఇవ్వడం కోసమే ఆయనను మధిర నుంచి పోటీకి పార్టీ నిలిపిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నా.. అధికారికంగా మాత్రం పార్టీ ఖరారు చేయలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top