ఉత్కంఠ వీడింది.. మేయర్‌ పీఠం వారిదే..!

TRS All Set To Take Over Nizamabad Mayor Post - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ మేయర్‌ పదవిని దక్కించుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌కు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. మొత్తం 60 డివిజన్లలో 13 స్థానాల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం (16) మద్దతు ఇవ్వనుంది. దీంతోపాటు కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఓ కార్పొరేటర్‌, మరో ఇండిపెండెంట్‌ కార్పొరేటర్ గులాబీ గూటికి చేరాడు. ఇక ఆరుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యుల మద్దతుతో టీఆర్‌ఎస్‌ బలం 37కి చేరింది. 67 మంది సభ్యుల ఓట్లతో మేయర్ ఎన్నిక జరుగనుంది. మేయర్‌ పదవి దక్కాలంటే ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలిసి సంఖ్యా బలం 34 ఉండాలి. 37 మంది సభ్యులతో గులాబీ పార్టీ ముందు వరుసలో ఉంది. మేయర్ పదవి టీఆర్‌ఎస్‌కు, డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎంకు కేటాయించేలా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. మేయర్ పీఠం కోసం ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. ఒకరి పేరును టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఫైనల్‌ చేసినట్టు సమాచారం.
(చదవండి : నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు లైన్‌క్లియర్‌)

ఇదిలాఉండగా... 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పక్షంగా బీజేపీ అవతరించిన్పటికీ సరిపడినంత మెజారిటీ దక్కలేదు. కాంగ్రెస్‌ రెండు డివిజన్లలో, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ నేపథ్యంలో.. మేయర్‌ కోసం కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ తమకు రాలేదని.. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మద్దతుతో పాటు ఎక్స్‌అఫీషియా సభ్యులు ఓటింగ్‌ పరంగా కూడా గులాబీ పార్టీకే ఎక్కువ బలం ఉన్నందున తాము వెనక్కి తగ్గుతున్నామని ఎంపీ అరవింద్‌ ఆదివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణం, 12:30 నుంచి మేయర్ ఎన్నిక ప్రక్రియ, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభ కానుంది. 
(చదవండి : 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top