ఈ నెలాఖరున లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన : జెట్టి | TPCC Working President Jetti Kusum Kumar Says Congress Get Ready For Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

ఈ నెలాఖరున లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన : జెట్టి

Feb 13 2019 3:16 PM | Updated on Mar 18 2019 9:02 PM

TPCC Working President Jetti Kusum Kumar Says Congress Get Ready For Lok Sabha Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 స్థానాల్లో పోటీ చేస్తుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్‌ స్పష్టం​ చేశారు. లోక్‌సభ అభ్యర్థులను ఈ నెలఖరులోగా ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అత్యధిక సీట్లు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోందన్నారు.

ఈ నెల 15,16,17 తేదీల్లో పార్లమెంట్‌ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈనెల 17న పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుందని చెప్పారు. అభ్యర్థులను ఎంపికలో ఒకటి లేదా రెండు పేర్లను మాత్రమే అధిష్టానానికి పంపుతామన్నారు. గెలుపు ప్రాతిపదికగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement