ఓటింగ్‌లో రియల్‌ సెలబ్రిటీలు

These are Real Celebreties in Voting - Sakshi

2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు నాలుగో దశ ఎన్నికల పోలింగ్  మరికొన్ని గంటల్లో ముగియనుంది. భారత వాణిజ్య రాజధాని ముంబై సహా దేశంలోని మొత్తం 8 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోలింగ్‌లో ముఖ్యంగా ముంబై పలువురు బాలీవుడ్‌ నటీనటులతో పాటు, పలు వ్యాపారవర్గాలకు చెందిన బిజినెస్‌ టై​కూన్‌లు, వివిధ కార్పొరేట్‌ దిగ్గజాలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆకర్షణీయంగా నిలిచారు. 

వీరందరికి తోడునేడు ఓటింగ్‌ జరుగుతున్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో చాలామందిసెలబ్రిటీలను మరిపిస్తూ మండేఎండను కూడా లెక్క చేయకుండా పలువురు  సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు తమ ప్రాథమిక హక్కును వినియోగించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా బాలాఘాట్‌ నియోజకవర్గంలో శాంతి బాయి పాండే (115) అనే వృద్ధ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అలాగే చేయి చేయి పట్టుకుని జట్టుగా  వచ్చిన ఒక వృద్ధ జంట ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అబ్బుర పర్చింది. 

రాజస్థాన్‌లోని సిరాహి జిల్లాలో ఆకార్‌భట్టా పోలింగ్‌బూత్‌లో ఇద్దరు కొత్త పెళ్లికూతుళ్లు ముచ్చటగా నిలిచి ఆకట్టుకున్నారు.  అక్కాచెల్లెళ్లయిన వీళ్లిద్దరూ వివాహ వేడుకకు ముంద పోలింగ్‌ స్టేషన్‌కు తరలి వచ్చారు. ఓటు వేసిన అనంతరం పెళ్లి పీటలెక్కేందుకు నిర్ణయించుకున్నారు.  

ముంబైలోని చెంబూరు స్వర్ణంబాల్‌ క్రిష్ట స్వామి(103)వీల్‌ చెయిర్‌లో వచ్చి మరీ తన ఓటు  వినియోగించుకోవడం విశేషం. 

బిహార్‌లో 95 ఏళ్ల వృద్ధుడు  తన బంధువు సహాయంతో ఓటింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. 

సూయిధాగా నటుడు వరుణ్‌ ధావన్‌ ఒక పెద్దావిడకు సహాయం నెటిజనుల ప్రశంసలను దక్కించుకున్నాడు. ముంబైలోని ఒక పోలింగ్‌ కేంద్రం మెట్లు ఎక్కుతున్న మహిళకు తన  చేయి అందించారు.   రియల్‌ సెలబ్రిటీ అంటూ ఈ పిక్స్‌ వైరల్‌  అయ్యాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top