రూ.1,82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ | Telangana CM KCR presents budget for 2019 | Sakshi
Sakshi News home page

సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది: కేసీఆర్‌

Feb 22 2019 12:19 PM | Updated on Feb 22 2019 1:59 PM

Telangana CM KCR presents budget for 2019 - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు శుక్రవారం శాసనసభలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు శుక్రవారం శాసనసభలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఓ ముఖ్యమంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఆర్థిక శాఖ కూడా కేసీఆర్‌ వద్ద ఉండటంతో ఆయనే  సభలో 2018-19 వ్యయానికి సంబంధించి అనుబంధ పద్దులను, 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 6వ బడ్జెట్‌ అని పేర్కొన్న కేసీఆర్‌ స‍్వల్పకాలంలోనే పురోగతి సాధించామన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణను రోల్‌ మోడల్‌గా చూస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని కుటుంబమే లేదన్నారు. అందుకే అత్యధిక మెజార్టీతో టీఆర్‌ఎస్‌ను రెండోసారి గెలిపించారని కేసీఆర్‌ పేర్కొన్నారు. 2018-19లో తెలంగాణ వృద్ధిరేటు 10.6 శాతంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే ఆసరా పెన్షన్ల పధకం తన హృదయానికి దగ్గరైనదని అన్నారు. బడ్జెట్‌ సందర్భంగా ముఖ్యమంత్రి పలు హామీలు ఇచ్చారు.  (అమర జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ నివాళి) 

కాగా ఆంధ్రరాష్ట్ర మొదటి సీఎం బెజవాడ గోపాల్‌రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంలుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆర్థికశాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వాళ్ల తర్వాత సీఎం హోదాలో బడ్జెట్‌ ప్రవేశపెట‍్టింది కేసీఆరే. అలాగే స్వరాష్ట్రంలో బడ్జెట్‌ ప్రసంగం చేసిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. మరోవైపు  శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  (నేడే బడ్జెట్‌)

తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు...

2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

  • రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు
  • మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు
  • రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు
  • ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా
     
  • ఆసరా పెన్షన్లు వెయ్యి నుంచి రూ.2016కు పెంపు
  • ఆసరా పింఛన్ల కోసం రూ. 12,067 కోట్లు
  • దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు రూ.1500 నుంచి రూ.3016కు పెంపు
  • దీని కోసం బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు కేటాయింపు
  • పెన్షన్‌ వయసు 60 నుంచి 57 ఏళ్లకు తగ్గింపు
  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 1450 కోట్లు
     
  • నిరుద్యోగుల భృతి రూ.3016 (దీని కోసం విధివిధానాలను రూపకల్పన)
  • నిరుద్యోగ భృతి కోసం రూ. 1,810 కోట్లు
     
  • రైతుబంధు పథకానికి ఎకరానికి ఏడాదికి రూ.8 నుంచి రూ.10వేలు పెంపు
  • దీని కోసం బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు కేటాయింపు
  • వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు కేటాయింపు
  • రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లు
  • రైతు బీమా కోసం రూ. 650 కోట్లు
     
  • బియ్యం రాయితీ కోసం రూ. 2,744 కోట్లు
  • షెడ్యూలు కులాల ప్రగతి నిధి కోసం రూ. 16,581 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2004 కోట్లు
     
  • ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు
  • మిషన్‌ కాకతీయకు రూ.22,500 కేట్లు
  • బీసీలకు మారో 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లు
  • పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల కింద రూ.3,256 కోట్లు
  • ఒక్కో మనిషికి రూ.1606 చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు
  • 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8 లక్షల నిధులు
     
  • టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ.1,41 లక్షల కోట్లు పెట్టుబడులు
  • టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు
  • పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు భర్తీ
  • ఏప్రిల్‌ చివరినాటికి మిషన్‌ భగీరధ పనులు పూర్తి
  • ​​​​​​​మరో రెండు నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు
    ​​​​​​​
  • ​​​​​​​2019-20లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా రూ.94,776 కోట్లు
  • 2019-20లో కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనా రూ.22,835 కోట్లు
  • 2019-20లో ప్రగతి పద్దు రూ.1,07,302  కోట్లు
  • నిర్వహణ పద్దు రూ.74,715 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement