నాలుగేళ్ల పాలనపై బీజేపీ ప్రచారం | Take BJP's 'Four Years of Modi Sarkar' report card | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల పాలనపై బీజేపీ ప్రచారం

May 26 2018 5:06 AM | Updated on Oct 20 2018 5:26 PM

Take BJP's 'Four Years of Modi Sarkar' report card - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ అధిష్టానం 15 రోజుల కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వివిధ రంగాలకు చెందిన లక్షమంది ప్రముఖులను కలిసి మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలకు పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వం వహిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, పార్టీ ఆఫీసు బేరర్లు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు, మేథావులతో సదస్సులు, గ్రామసభలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement