గవర్నర్‌ పదవిపై స్పందించిన సుష్మా స్వరాజ్‌ | Sushma Swaraj Clarified That The Report Of AP Governor Was Not True | Sakshi
Sakshi News home page

ఆ వార్తలు అవాస్తవం సుష్మా స్వరాజ్‌

Jun 11 2019 9:56 AM | Updated on Jun 11 2019 10:57 AM

Sushma Swaraj Clarified That The Report Of AP Governor Was Not True - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ నియమితులయ్యారంట సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. అయితే ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సుష్మా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నిజంగానే గవర్నర్‌గా నియమితులైనట్లు వదంతులు వచ్చాయి. ఇదిలావుండగా సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలను చూసి కేంద్రమంత్రి హర్షవర్థన్‌ కూడా సుష్మాకు అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు కూడా సుష్మాను అభినందిస్తూ.. పోస్టులు చేయడంతో ఆమె స్పందించారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశారు. అనంతరం కేంద్రమంత్రి తన ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement