ఒక్క లోక్‌సభ సీటు గెలవగలరా?! | RJD will not get single seat in 2019 | Sakshi
Sakshi News home page

ఒక్క లోక్‌సభ సీటు గెలవగలరా?!

Oct 8 2017 11:03 AM | Updated on Oct 8 2017 12:39 PM

RJD will not get single seat in 2019

సాక్షి, పాట్నా : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీ (ఆర్జేడీ) బీహార్‌లో ఒక్క లోక్‌సభ సీటునైనా గెలవగలదా? బీజేపీ నేత ఆ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నిత్యానంద రాయ్‌ సవాల్‌ విసిరారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారులు అవినీతి, అక్రమాల వంటి పలు కేసుల్లో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే లాలూకు, ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రంలో చరిష్మా లేదని.. ఈ పరిస్థితుల్లో ఆర్జేడీ వచ్చే ఎన్నికల్లో ఒక్క లోక్‌సభ సీటును సైతం గెలవలేదని ఆయన చెప్పారు. దసరా-మొహర్రం సమయంలో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని అభాసు పాల్జేసేందుకు విపక్షాలన్నీ కలిసి కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రతిపక్షాల పాత్రను అర్థం చేసుకున్న ప్రజలు హుందాగా ప్రవర్తించారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement