ప్రధానమంత్రి పదవికి ప్రణబ్‌ ముఖర్జీ పోటీ? | Pranab Mukherjee May Be PM Candidate In 2019 Loksabha Elections | Sakshi
Sakshi News home page

ప్రధానమంత్రి పదవికి ప్రణబ్‌ ముఖర్జీ పోటీ?

May 30 2018 3:24 PM | Updated on Mar 18 2019 9:02 PM

Pranab Mukherjee May Be PM Candidate In 2019 Loksabha Elections - Sakshi

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (పాత ఫొటో)

న్యూఢిల్లీ : 50 ఏళ్లుగా భారతీయ జాతీయ కాంగ్రెస్‌(ఐఎన్‌సీ) పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆ పార్టీని దూరం పెట్టాలని భావిస్తున్నారా?. కాంగ్రెస్‌ హస్త ముద్రను తనపై నుంచి తొలగించుకుని వ్యక్తిగత గుర్తింపు కోసం ప్రణబ్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు ప్రత్యాయమ్నాయంగా నేతల్ని ఏకం చేసి 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ(82) నిలవబోతున్నట్లు జాతీయ మీడియా సంస్థ ‘ఎన్‌డీటీవీ’ బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ విషయంపై దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడగా ఇది నిజమేనని అనిపిస్తున్నట్లు ‘ఎన్‌డీటీవీ’ వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలూ లేకపోలేదని కొందరు నేతలు చెప్పినట్లు వెల్లడించింది.

ఆరెస్సెస్‌ ఆహ్వానంపై రగడ
రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) సభకు ప్రణబ్‌ ముఖర్జీని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, దానికి ఆయన సమ్మతించడంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ వర్గాలు ఈ పరిణామంతో విస్తుబోయాయి. వచ్చే నెల 7వ తేదీన నాగ్‌పూర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement