అప్పుడు భర్తల పోరు.. ఇప్పుడు భార్యల వంతు

Political Leaders Wife Competitions For Local Elections West godavari - Sakshi

పశ్చిమగోదావరి ,  ఉంగుటూరు: గతంలో భర్తల మధ్య, ఇప్పుడు భార్యల మధ్య పోటీ ఉంగుటూరు మండలంలో ఆసక్తికరంగా మారింది. మండల జెడ్పీటీసీ స్థానానికి ఈ పోటీ జరగనుంది. 2015లో జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున చింతలవాసు, కాంగ్రెస్‌ పార్టీ తరఫున కొరిపల్లి శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చింతల వాసు గెలిచారు. ఇప్పడు అదే ఉంగుటూరు జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. కాగా కాంగ్రెసులోంచి కొరిపల్లి శ్రీను వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే వాసుబాబుకు మంచి నాయకుడిగా, అనుచరుడిగా పనిచేస్తున్నారు. దాంతో వైసీపీ తరఫున కొరిపల్లి శ్రీను భార్య కొరిపల్లి జయలక్ష్మిని పోటీలోకి దింపుతున్నారు. జయలక్ష్మికి మంత్రి వసంతకుమార్‌ హయాంలో ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే జయలక్ష్మి మీదకు టీడీపీ తరఫున మాజీ జెడ్పీటీసీ చింతలవాసు భార్య చింతల రాజేశ్వరిని పోటీకి ఆ పార్టీ ఎంపికచేసింది. వారిద్దరిదీ కైకరం గ్రామం కావటం మరో విశేషం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top