సీఎంగారు మాకూ జీవించే హక్కుంది: పవన్‌ కల్యాణ్‌

Pawn Kalyan demands Bhimavaram Dumping Yard Will Be Changed To Outskirts - Sakshi

సాక్షి, భీమవరం: ముఖ్యమంత్రి గారు మీ కొడుకుకే కాదు మాకు కూడా ఆరోగ్యం కల్పించడంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభ్యర్ధించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వారు జనావాసాలకు సమీపంగా, అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలించారు.

అనంతరం డంపింగ్‌ యార్డ్‌ను ఇలా జనవాసాలకు దగ్గరగా ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన దుర్గంధం రావడమే కాక.. పందులు, దోమలు విజృంభించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేవలం ఆయన కొడుకు గురించే కాక రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలని కోరారు. ఈ సందర్భంగా డంపింగ్‌ యార్డ్‌ చుట్టు పక్కల ఉన్న పిల్లల చేత ‘ముఖ్యమంత్రి గారు మా అందరికి ఆరోగ్యం కల్పించండి’ అంటూ ప్రమాణం చేయించారు. తక్షణమే ఈ డంపింగ్‌ యార్డ్‌ను ఇక్కడ నుంచి తొలగించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top