
‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు తప్పు ఉందని.. అయినప్పటికీ ఆయన సీఎం కుర్చీలో ఉంటే ఆయనకు ఉన్న అనుభవంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తారన్న భావనతోనే ఆ అంశంపై తాను మౌనంగా ఉంటున్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్‌కల్యాణ్ శుక్రవారం విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఫాతిమా కాలేజీ విద్యార్ధులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, విద్యుత్ ఒప్పంద కార్మికులు, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చెబితే ప్రభుత్వం అన్నీ చేస్తుందనేది అపోహ మాత్రమేనన్నారు. సమస్యలను అర్ధం చేసుకుంటారు కాబట్టే చంద్రబాబుకు సపోర్ట్ చేశానన్నారు. అందరూ తాను ఏదో ఒక సమయంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నానని, తరువాత కనిపించటం లేదంటు న్నారని, ఇకపై సినిమాలు వదిలి వస్తున్నానన్నారు.