‘బాబు అక్రమార్జన అంతా సింగపూర్‌ వెళ్లుంటుంది’

Pandula Ravindra Babu Comments On Chandrababu Over IT Raids - Sakshi

సాక్షి, కాకినాడ: చంద్రబాబు తమ మెదడును ఉపయోగించి రూ.2 కోట్ల టర్నోవర్‌ ఉన్న కాంట్రాక్టర్లను ఎంచుకుని చేసిన బ్రహ్మాండమైన మోసమని అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. ఆయన దగ్గర పనిచేసిన పీఎస్‌ శ్రీనివాస్‌ వద్ద ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్లు దొరకడం అందరినీ షాక్‌కు గురిచేసిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి సింగపూర్‌ సింగపూర్‌ అంటున్న బాబు అక్రమార్జన అంతా సింగపూర్‌ వెళ్లుంటుందని విమర్శించారు. హవాల ద్వారా పంపిన బ్లాక్‌మనీ.. విదేశీ పెట్టుబడుల రూపంలో మనకు వైట్‌మనీగా వస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక టీడీపీ పాలనలో అమరావతి, విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సుపై దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎందుకంటే సదస్సుకు వచ్చిన వారంతా బాబు మనుషులేనని పేర్కొన్నారు.

అవన్నీ బాబు షెల్‌ కంపెనీలే
‘చంద్రబాబు సీఎం కాగానే లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని పలు కంపెనీలు, పరిశ్రమలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇవన్నీ బాబు షెల్ కంపెనీలే. ఆయన అవినీతి బాగోతం, మనీ లాండరింగ్‌పై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలి. చంద్రబాబు, లోకేష్ దగ్గర ఐటీ దాడుల్లో ఏమీ దొరకలేదు కధా? వారికేం సంబంధం అని చాలామంది అంటారు. కానీ దీనినే బినామీ ట్రాంజాక్షన్ అంటాము. అలాగే చంద్రబాబు సూపర్‌వైజింగ్ ఫెయిల్యూర్ అని కూడా అనవచ్చు. మన ఇంట్లో ఏం జరుగుతుందో చూడాల్సిన బాధ్యత యాజమానిపై ఉంటుంది. అలాగే ప్రభుత్వంలో తన వద్ద పని చేసిన వ్యక్తి వద్ద పెద్ద మొత్తం సొమ్ము పట్టుబడిందంటే చంద్రబాబు సూపర్‌వైజింగ్ ఫెయిల్యూరా? లేదా కుమ్మక్కుతో కూడిన కుంభకోణమా? అనేది తేలాల్సి ఉంది. ఈ కుంభకోణంలో చంద్రబాబు హ్యండ్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉంటుంది. అందువల్ల ఇది పూర్తిగా బయటపడాలంటే వెంటనే ఐటీ శాఖ శ్రీనివాస్ కేసును తక్షణమే సిబిఐకి అప్పగించి విచారణ చేయించాలి’ అని డిమాండ్‌ చేశారు. (ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు)

చదవండి: చంద్రబాబు అవినీతి బట్టబయలు
రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్కు చంద్రబాబు పయనం!

బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు

లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది

చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో!

(చంద్రబాబు మాజీ పీఎస్ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top