టీడీపీ ఔట్‌.. వైఎస్సార్‌సీపీ ఇన్‌

New Office Allocated In Parliament To YSRCP - Sakshi

పార్లమెంట్‌లో వైస్సార్‌సీపీకి కొత్త కార్యాలయం

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యాలయాన్ని కేటాయించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 22 మంది ఎంపీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎంపీల విజ్ఞప్తి మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం​ బిర్లా.. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిని కేటాయించారు. ఈ గదిలో గత 30 ఏళ్లుగా టీడీపీ కార్యాలయం కొనసాగుతోంది.  సరైన సంఖ్యలో సభ్యులు లేనప్పటికీ బయటిశక్తుల ఒత్తిడి మేరకు అదే కార్యాలయంలో టీడీపీ తిష్టవేసింది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 22 మంది ఎంపీలు గెలవడంతో ఆ కార్యాలయాన్ని వారికి కేటాయిస్తున్నట్లు స్పీకర్‌ శనివారం తెలిపారు. (కేంద్రం మొండిచేయి చూపింది: విజయసాయి రెడ్డి)

మూడో అంతస్తులోని 118 నెంబర్ గదికి టీడీపీ కార్యాలయం తరలించారు. మూడు నెలల కిందటే అయిదో నెంబర్ గది కేటాయించినా ఖాళీ చేయలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ ద్వారా స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా.. మరోసారి ఓం​ బిర్లాను కలవడంతో లేఖపై స్పందించారు. ఆయన ఆదేశాలతో పార్లమెంట్‌ సిబ్బంది.. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదికి టీడీపీ బోర్డును తొలగించి.. వైఎస్సార్‌సీపీ కార్యాలయంగా మార్చారు. ఈ కార్యాలయానికి సమీపంలోని ప్రధానమంత్రి మోదీ (పదో నెంబర్ గది), హోం మంత్రి అమిత్‌ షా కార్యాలయం కూడా ఉంది. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top