కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవద్దనేది నా సలహా

Mudragada Padmanabham Is Written A Letter To AP CM Chandra Babu Naidu - Sakshi

సాక్షి, కిర్లంపూడి(తూర్పుగోదావరి జిల్లా) : ఏపీ సీఎం నారా చంద్ర బాబు నాయుడికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటు లేఖ సందించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే ఈ మధ్య మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని సీఎం చంద్ర బాబునుద్దేశించి విమర్శించారు. మీరు నిప్పు కదా.. నిప్పుకు భయం ఉంటుందా అని ఎద్దేవా చేశారు.

‘ ఏ ఘనకార్యం చేశారని ప్రజలు మీ వెనుక ఉండాలని కోరుకుంటున్నారు. మీ వెనకాలే ఉంటే మీ మాదిరిగానే అక్రమ కేసులు, ఉక్కుపాదాలతో అణచిచేస్తే అమాయక ప్రజలకు దిక్కెవరు. మీ కుమారునిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని ఎందుకు సవాల్ చేయలేకపోతున్నారు. సీబీఐ విచారణ కోసం కేంద్రానికి సవాలు విసరకపోతే చరిత్రహీనులు కావడం తధ్యం. ఒకవేళ మిమ్మల్ని, మీ కుమారుడు నారా లోకేష్‌ని అరెస్టు చేస్తే..కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవద్దని నా సలహా’  అని లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top