వైఎస్సార్‌సీపీ నేతలకు ఎంపీ కవిత ప్రశంసలు

MP Kavitha Talk About Special Status - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. మంగళవారం కవిత సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు అనుకున్నట్లుగానే రాజీనామాలు చేసి, వాటిని ఆమోదించుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానంపై ఒక స్పష్టత లేదని, అది చర్చకు వస్తుందో లేదో కూడా తెలియడం లేదని అన్నారు. 

మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ప్రస్తుతం హడావిడి చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఈసారి పార్లమెంట్‌లో తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలపై పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై సభను అడ్డకునే ఉద్దేశంలో కాకుండా చర్చలో పాల్గొని వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. అదేవింధంగా ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని అన్నారు. డీ. శ్రీనివాస్‌ విషయంలో కేసీఆర్‌దే తుది నిర్ణయమని తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top