‘టీఆర్‌ఎస్‌ మత రాజకీయాలకు పాల్పడుతోంది’

MLC Ramachandra Rao Slams On KCR Over Corona Virus Testing In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించిందని ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు అన్నారు. ఆయన తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాతూ.. రాష్ట్రంలో టెస్టులు చేయకపోవడాన్నితప్పుపడుతున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తోందని, విమర్శలు కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి 590 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ఇంత తక్కువ టెస్టులు తెలంగాణలోనే జరుగుతున్నయని అన్నారు. మహారాష్ట్రలో 10 లక్షల మందికి రెండు వేల టెస్టులు జరుతున్నాయని రామచంద్రరావు చెప్పారు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీ చేస్తున్న అరాచకాలపై స్పందించకుండా టీఆర్‌ఎస్‌ మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు బాధ్యతాయుతంగా తమ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ లేఖ రాశారని రామచంద్రరావు తెలిపారు. (కరోనాతో సహ జీవనం చేయాల్సిందే : మంత్రి)

అదేవిధంగా జేపీ నేత డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీసూచనలను పరిగణలోకి తీసుకోకుండామంత్రులు రాజకీయం చేస్తున్నారని ఇది సమంజసం కాదన్నారు. సీఎం కేసీఆర్స్వయంగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని మొత్తం ధాన్యాన్ని 45రోజుల్లో పూర్తి చేస్తామని ఏప్రిల్ 8నప్రకటించారని గుర్తు చేశారు. ఈ రోజు వరకు ధాన్యం ఎంత కొనుగోలు చేశారని ఆమె ప్రశ్నించారు. కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని ఆమె తెలిపారు. మిగతా 75 శాతం ఎప్పుడు కొంటారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది, రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను నష్టాలకు గురిచేస్తోందని ఆమె మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ మొదటి నుంచి హెచ్చరిస్తున్న పెడ చెవిన పెట్టారని ఆమె విరుచకుపడ్డారు.

రాజకీయాలు మేం చేయదలిస్తే ఏ ఒక్క మంత్రి బయట తిరగలేరని డీకే అరుణ హెచ్చరించారు. కేంద్రం చర్యల వల్లే రైతులకు నాణ్యమైన కరెంట్ అందుతోందని ఆమె గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మంచి జరుగుతే తనదే క్రెడిట్ అని, చెడు జరిగితే మాత్రం ఇతరులపైకి నెపం వేయడం అలవాటుగా మారిందని ఆమె మండిపడ్డారు. అవసరమైతే ధాన్యం నిలువకు ఫంక్షన్‌హాల్ తీసుకుంటామన్న వాళ్లు ఎందుకు చేయడం లేదని డీకే అరుణ తీవ్రంగా విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద పట్టికలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదుని ప్రశ్నించారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు దీక్షలు చేస్తే దాన్ని కూడా తప్పుపట్టారని అమె  మండిపడ్డారు.  సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేయాలని డీకే ఆరుణ డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top