ఈ సారైనా నాకు ఓటేయండి! | mla swamy request to people for vote in janmabhoomi program | Sakshi
Sakshi News home page

ఈ సారైనా నాకు ఓటేయండి!

Jan 6 2018 11:06 AM | Updated on Jan 6 2018 11:06 AM

mla swamy request to people for vote in janmabhoomi program - Sakshi

ఎమ్మెల్యే స్వామిని ప్రశ్నిస్తున్న సుంకిరెడ్డిపాలెం సర్పంచ్‌ బ్రహ్మారెడ్డి

సుంకిరెడ్డిపాలెం(పొన్నలూరు): మీ గ్రామంలో అభివృద్ధి పనులు చేశాను. గత ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదు కనీసం ఈ సారైన నాకు ఓట్లు వేయండని ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి గ్రామస్తులకు విన్నవించారు. మండలంలోని సుంకిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటికైన మీరు మారి ఈ సారైన నాకు ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యే పలుమార్లు గత ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదని అనడంతో అవాక్కైన గ్రామస్తులు మీరు దగ్గరుడి చూసినట్లు పదే పదే నాకు ఓటు వేయలేదంటున్నారేమిటని ప్రశ్నించారు.

స్థానిక సర్పంచ్‌ వరికూటి బ్రహ్మారెడ్డి ప్రభుత్వం నుంచి మంజూరైన అభివృద్ధి పనులను తనను చేయనివ్వకుండా పక్క గ్రామాలకు చెందిన అధికారపార్టీ నాయకులతో చేయించడం ఏమిటంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్‌ మట్టి తోలించి బిల్లులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు, ప్రత్యేక అధికారి ఉమాదేవి, ఎంపీపీ వీరకుమారి, ఎంపీడీఓ పద్మజ, తహసీల్దార్‌ మహ్మద్‌హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement