
సాక్షి, విజయవాడ: ఏమి సాధించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధానిలో రౌండ్‌టేబుల్ సమావేశం పెడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబుకు మతిభ్రమించి.. టైంపాస్ కోసమే పర్యటనలు, రౌండ్ సమావేశాలంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ఆయనదేనన్నారు. ‘గత ఐదు సంవత్సరాల్లో చేయలేని పనులను ఆరు నెలల్లో చేసి చూపిస్తోన్న సీఎం వైఎస్ జగన్‌ను చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ ఈర్ష్య పడుతున్నారు. కమిట్మెంట్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్. కమిట్మెంట్‌కు అర్థం తెలియని పార్టీలు టీడీపీ, జనసేన’ పార్టీలని వెల్లంపల్లి అన్నారు. ప్రజల్లో సీఎం జగన్‌కు వస్తోన్న ఆదరణను తట్టుకోలేక మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ చేస్తే..పవన్ నటిస్తారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే ఏమిటో సీఎం జగన్ చేసి చూపిస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.