పార్లమెంట్‌ నియోజకవర్గానికో స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌

Minister Avanthi Srinivas Comments on TDP in Assembly - Sakshi

 అసెంబ్లీలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు

అమరావతి: పార్లమెంట్‌ నియోజకర్గానికి ఒక స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు తెలిపారు. చివరి రోజు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఎన్నికలు వచ్చేవరకు టీడీపీకి నిరుద్యోగ భృతి గుర్తుకు రాలేదన్నారు. ఏపీలో 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, 4 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించారన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు.

 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top