ఇండియన్‌ ఈవీఎంల ట్యాంపరింగ్‌ కష్టం

Mass EVM tampering difficult to do - Sakshi

వాషింగ్టన్‌: భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడం చాలా కష్టమని ప్రముఖ అమెరికన్‌ నిపుణుడు గెల్బ్‌ పేర్కొన్నారు. ఈ ఈవీఎంలు ఆఫ్‌లైన్‌లో పనిచేయడం వల్ల స్వతంత్ర యూనిట్లుగా ఉంటాయని తెలిపారు. ‘భారత్‌లో వాడుతున్న ఈవీఎంలలో ఉపయోగించిన సాంకేతికత నమ్మదగినదని నేను చేసిన అధ్యయనంలో స్పష్టమైంది. ఏ టెక్నాలజీ నిర్దిష్టమైనది కాదు. కానీ భారత్‌లో వాడుతున్న ఈవీఎంలు ఆఫ్‌లైన్‌లో పనిచేస్తున్నాయి. అందుకే వాటిని నేరుగా మాత్రమే ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉంది. మరో విధంగా చేయలేం’అని పేర్కొన్నారు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలను మాస్‌ ట్యాంపరింగ్‌ చేయడం కష్టమని తాను చేసిన పరిశోధనల్లో తేలిందని గెల్బ్‌ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక స్వతంత్ర ఎలక్ట్రానిక్‌ పరికరమని, ఇతర దేశాల్లో ఓటు వేసే విధానాలకు ఇది భిన్నంగా ఉంటుందని గెల్బ్‌ అన్నా రు. ఈవీఎంలను పరిశీలించకుండా, ఒక సమన్వయ ప్రాతిపదిక లేకుండా ట్యాంపరింగ్‌ చేయడం కష్టమన్నారు. అంతేకాకుండా వీవీప్యాట్‌ల వల్ల ఎన్నికల్లో విశ్వసనీయత, వాస్తవికత ఉంటుందన్నారు.   
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top