నా హత్యకు సీఎం కుట్ర: మంద కృష్ణ | Manda karishna madiga commenanetd on telangana government | Sakshi
Sakshi News home page

నా హత్యకు సీఎం కుట్ర: మంద కృష్ణ

Mar 20 2018 2:40 AM | Updated on Mar 20 2018 8:53 AM

Manda karishna madiga commenanetd on telangana government - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తనను హత్య చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తోందని, తనను జైల్లో పెట్టిన సమయంలోనే హత్యకు కుట్ర జరిగిందని, ఈ కుట్రలో సీఎం, ఇద్దరు మంత్రులు, ఒక ఎమ్మెల్యే హస్తం ఉందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.

సోమవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, కుంతియా ఇతర నేతలను కలసి పార్లమెంటులో వర్గీకరణ అంశాన్ని లేవనెత్తేలా కాంగ్రెస్‌ తరఫున చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం ఉత్తమ్, కుంతియాతో కలసి మీడియాతో మాట్లాడారు. తన హత్యకు జరుగుతున్న కుట్రలపై సీబీఐ విచారణ జరిపించాలని, అప్పుడే ప్రభుత్వ పెద్దల ప్రమేయం బయటపడుతుందన్నారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ మంద కృష్ణ హత్యకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఈ కుట్రలో ప్రభుత్వ పెద్దలున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement