‘కొడుకుకే కిరీటం’

Lalu Prasad names Tejashwi as RJD's next CM candidate  - Sakshi

సాక్షి, పాట్నా: తదుపరి బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు తేజస్వి యాదవ్‌ ఆర్‌జేడీ సీఎం అభ్యర్థిగా పార్టీని ముందుండి నడిపిస్తారని ఆ పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ శుక్రవారం ప్రకటించారు.తేజస్వి నాయకత్వంలో ఆర్‌జేడీ 2020లో జరిగే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని లాలూ స్పష్టం చేశారు. పార్టీ సీనియర్‌ నేతలు అబ్ధుల్‌ బరి సిద్ధిఖి, రఘవంశ్‌ ప్రసాద్‌ సింగ్‌లతో భేటీ అనంతరం లాలూ ఈ ప్రకటన చేశారు.  

తేజస్వి పార్టీకి అందిస్తున్నసేవలను ఈ సందర్భంగా లాలూ ప్రశంసించారు. ఈనెల 9న 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తేజస్వి ప్రస్తుతం బీహార్‌ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు.అయితే తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై పార్టీలో స్పష్టత రాలేదని పార్టీవ ర్గాలు పేర్కొనడం గమనార్హం.

అంతకుముందు ఆర్‌జేడీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌ చందర్‌ పుర్వే బీహార్‌ తదుపరి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ పేరును ప్రతిపాదించగా, సిద్ధికీ, సింగ్‌లు పుర్వే అభిప్రాయంతో విభేదించడంతో పార్టీలో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top