ఎన్నికల బరిలోకి లాలూ కోడలు..!

Lalu daughter-in-law may contest 2019 Lok Sabha elections - Sakshi

పట్నా : ఆర్జేడీ నాయకుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ సతీమణి ఐశ్వర్యరాయ్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? అంటే కథనాలు ఔననే అంటున్నాయి. బిహార్‌లోని ఛాప్రా నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. అయితే, పార్టీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

లాలూ తనయుడు తేజ్‌ ప్రతాప్‌, బిహార్‌ మాజీ సీఎం దరోగా ప్రసాద్‌ రాయ్‌ మనవరాలు ఐశ్వర్యరాయ్‌ ఈ నెల 12న జరిగిన సంగతి తెలిసిందే. ఆమె ఛాప్రాకు చెందిన వ్యక్తి కావడంతో.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఛాప్రా ఆడబిడ్డ అయిన ఐశ్వర్య ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే బాగుంటుందని, ఈ విషయంలో లాలూ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ నేత రాహుల్‌ తివారీ పేర్కొన్నారు. మరోవైపు ఐశ్వర్య ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న వార్త అధికారికంగా ధ్రువీకరించకముందే.. అధికార జేడీయూ ఆర్జేడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఆర్జేడీ కోసం కార్యకర్తలు ఎంత కష్టపడినా.. ఎన్నికల్లో టికెట్లు మాత్రం లాలూ కుటుంబానికే దక్కుతాయని జేడీయూ నేతలు విమర్శిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top