కేసీఆర్‌ పని అయిపోయింది: కోమటిరెడ్డి  | Komatireddy Venkat Reddy Comments Over Etela Rajender Issue In TRS Party | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పని అయిపోయింది: కోమటిరెడ్డి 

Sep 1 2019 7:35 AM | Updated on Sep 1 2019 7:35 AM

Komatireddy Venkat Reddy Comments Over Etela Rajender Issue In TRS Party - Sakshi

రామన్నపేట: వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ఆవేదనతో చేసిన వ్యాఖ్యల ద్వారా సీఎం కేసీఆర్‌ పని అయిపోయినట్లు తెలంగాణ సమాజానికి అర్థమైందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో విలేకరులతో మాట్లాడుతూ, ‘కులం పేరుతో తనకు మంత్రిపదవి రాలేదని, తెలంగాణకోసం కొట్లాడిన ఓనర్లమని’ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ కేసీఆర్‌ ఒక్కడి సొంతం కాదని అర్థమ వుతుందని తెలిపారు. ఈటలతోపాటు, సీనియర్‌ నాయకుడు హరీశ్‌ రావు లాంటి వాళ్లు పార్టీమారే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పార్టీమారితే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు తమ పార్టీ కార్యకర్తలు పడిన బాధేంటో వారికి తెలుస్తుంద న్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చుచేస్తున్న కేసీఆర్, బి.వెల్లెంల ప్రాజెక్టుకు రూ.200 కోట్లు కేటాయించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement