సీబీఐ విచారణా..? రాజీనామానా..?

komati reddy venkata reddy on srinivas murder - Sakshi

శ్రీనివాస్‌ హత్య కేసుపై మంత్రి జగదీశ్‌రెడ్డికి కోమటిరెడ్డి సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసు, ఎమ్మెల్యే వేముల వీరేశం సన్నిహితుల కాల్‌డేటాపై సీబీఐతో విచారణ జరిపించాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్‌ విసిరారు. ‘కాల్‌డేటా తప్పు, ఎవరైనా తయారుచేసుకోవచ్చు’అన్న జగదీశ్‌రెడ్డిని మంత్రి అనడానికి సిగ్గుపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. కాల్‌డేటా తప్పయితే పోలీసులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఆ డేటా ప్రకారం తిరిగి విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

మంగళవారం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మిర్చి బండి దగ్గర తగాదా అని పోలీసులు అంటుంటే, కాంగ్రెస్‌ అంతర్గత తగాదాలని మంత్రి అంటున్నారని విమర్శించారు. ఏది నిజమో తెలుసుకోకుండా మాట్లాడే వ్యక్తి మంత్రి స్థాయికి అనర్హుడని దుయ్యబట్టారు. మంత్రికి తెలివిలేదని వ్యాఖ్యానించారు. స్వగ్రామంలో, మరికొన్ని హత్య కేసుల్లో జగదీశ్‌రెడ్డి ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి 6 నెలలే మంత్రిగా ఉంటారని, ఆ తర్వాత చీప్‌ లిక్కర్‌ అమ్ముకుని బతకాలని ఎద్దేవా చేశారు. రాజకీయాల నుంచి కేసీఆర్‌ విరమించుకున్న తర్వాత హరీశ్‌రావు, కేటీఆర్‌ కొట్టుకుంటారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top