చంద్రబాబు ఆలోచనలపైనే బీజేపీ భవిష్యత్తు: జేసీ | JC Diwakar Reddy Says BJP Future Depends On Chandrababu Thoughts | Sakshi
Sakshi News home page

అందులో పరోక్షంగా చంద్రబాబు పాత్ర ఉంది: జేసీ

Sep 14 2019 11:16 AM | Updated on Sep 14 2019 2:11 PM

JC Diwakar Reddy Says BJP Future Depends On Chandrababu Thoughts - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలపైనే ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల కారణంగా ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. శనివారం కడపలో జేసీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం మొదలైందన్నారు. ఆ ప్రభంజనం ఎక్కువైనా లేదా తక్కువైనా కావచ్చునని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరోక్ష పాత్ర ఎంతైనా ఉందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement