టీడీపీ అధికారంలోకి వస్తే కబ్జాలే: పవన్‌ | Janasena Chief Pawan Kalyan Slams TDP In Tirupathi | Sakshi
Sakshi News home page

టీడీపీ అధికారంలోకి వస్తే కబ్జాలే: పవన్‌

Apr 4 2019 5:52 PM | Updated on Apr 4 2019 6:24 PM

Janasena Chief Pawan Kalyan Slams TDP In Tirupathi - Sakshi

తిరుపతి ఎన్నికల ప్రచారంలో జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌

తిరుపతి: టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ అల్లుడి అరాచకాలు తిరుపతిలో ఎక్కువయ్యాయని, మళ్లీ గనక టీడీపీ అధికారంలోకి వస్తే కబ్జాలు ఎక్కువైపోతాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తిరుపతిలో పవన్‌ ప్రసగించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి తాను ఏకలవ్య శిష్యుడినని పేర్కొన్నారు. తిరుపతిలో జనసేన కార్యకర్త వినోద్‌ రాయల్‌ను అతి దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటకు విలువ ఇవ్వలేదు..ఇదే తిరుపతి నుంచి ఇచ్చిన హామీ విస్మరించారని గుర్తు చేశారు.

బీజేపీ వాళ్లు తెలుగు ప్రజలకు చేసిన మోసం ఏనాడూ మర్చిపోరని అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఏపీ ప్రత్యేక హోదా కోసం మద్ధతు ఇచ్చారని తెలిపారు. తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిని ఎయిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. తిరుపతిలోని 52 మురికివాడల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. తలకోనలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం..విజయ డైరీ తిరిగి తెరిపిస్తాం.. సమాంతర డైరీ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరులో టీడీపీ హయాంలో రౌడీయిజం పెరిగిందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement