ప్రజల కడుపు నింపట్లేదు: జగ్గారెడ్డి | Sakshi
Sakshi News home page

ప్రజల కడుపు నింపట్లేదు: జగ్గారెడ్డి

Published Fri, Dec 13 2019 2:00 AM

Jagga Reddy Fires On KCR Over Rythu Runa Mafi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తియ్యటి మాటలతో ప్రజల నోరు తీపి చేస్తోందే తప్ప వారి కడుపు నింపడం లేదని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ మరింత ఆరోగ్యంతో మంచి పాలన అందించాలని తాను కోరుతున్నానని, ఎన్నికల హామీల అమలుపై ఆయన ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరారు.

గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ చెప్పినా ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని నమ్మి ఓట్లేశారని, ఏడాది గడుస్తున్నా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీపై స్పష్టత లేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement