బాధ్యతలు స్వీకరించిన మంత్రి ‘గంగుల’

Gangula Kamalakar Has Taken Ministerial Responsibility - Sakshi

సాక్షి, కరీంనగర్‌: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రిగా ఇటీవల నియామకమైన కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న బీసీకమిషన్‌ కార్యాలయంలో కుటుంబసభ్యుల సమక్షంలో గురువారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు గంగులను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలి పారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ తనకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండుశాఖల ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సేవ చేసే అవకాశం ఇచ్చారని అన్నారు. ఖరీఫ్‌లో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశం ఉందని రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు.

పలువురి అభినందనలు
మంత్రిగా కమలాకర్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం, కరీంనగర్‌ మాజీ డిప్యూటీ మేయ ర్‌ గుగ్గిళ్లపు రమేష్, నాయకులు వై.సునీల్‌రావు, చల్ల హరిశంకర్, ఎడ్ల అశోక్, బండారి వేణు, గందె మహేశ్, తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top