గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ | Gajwel TRS Leaders Join Congress | Sakshi
Sakshi News home page

Oct 3 2018 2:35 PM | Updated on Sep 19 2019 8:44 PM

Gajwel TRS Leaders Join Congress - Sakshi

సాక్షి, మెదక్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌.. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్‌.. మరోసారి ఇక్కడి నుంచి ఎన్నిలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా మారిన గజ్వేల్‌లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నేతలు, వారి అనుచరులు తాజాగా కాంగ్రెస్‌ గూటికి చేరారు. జగదేవ్‌పూర్‌ ఎంపీపీ రేణుకతోపాటు ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేణుకతోపాటు ఎంపీటీసీలు మమతాభాను, కవితా యాదగిరి, కౌన్సిలర్‌ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

కేసీఆర్‌కు చెందిన ఫార్మ్‌హౌస్‌ జగదేవపూర్‌లోనే ఉంది. ఈ ప్రాంత ఎంపీపీ తాజాగా కాంగ్రెస్‌ గూటికి చేరడం గమనార్హం. పలువురు నేతల చేరిక సందర్భంటా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement