'అది టీఆర్‌ఎస్‌ ఎంపీల చేతగానితనం'

congress leader ponnam prabhakar slams trs mps - Sakshi

ప్రధాని వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎందుకు మాట్లాడలేదు

సాక్షి, కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలు విభజన హామీల గురించి పార్లమెంట్‌లో మాట్లాడక పోవడం చేతకాని తనానికి నిదర్శనమని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ తలుపులు వేసి తెలంగాణ బిల్లును ఆమోదించారని ప్రధాని మోదీ అంటుంటే సభలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు స్పందించలేదన్నారు. తెలంగాణను అన్యాయంగా ఇచ్చారని అంటుంటే ఎంపీలు చవట దద్దమ్మలుగా ఎందుకు ఉన్నారన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై స్పందిస్తే కేసీఆర్‌పై సీబీఐ కేసు బయటకి వస్తుందని భయపడ్డారా అని ప్రశ్నించారు. ఎంపీ కవిత సిగ్గు లేకుండా జై ఆంధ్రా అనడం బాధ్యతనా అని అన్నారు.

మరో వైపు కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు చేసేముందు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని, లేదంటే రాళ్లతో కొట్టే రోజులు వస్తాయన్నారు. విమర్శలకు.. విమర్శలు సమాధానం కాదని.. ఇక తమ యాక్షన్‌ ఉంటుందన్నారు. అసహనంగా వ్యాఖ్యలు చేస్తే.. సందర్భానుసారంగా గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top