కేసీఆర్‌వే బఫూన్‌ చర్యలు: జానారెడ్డి

Congress Leader Jana Reddy Slams Kcr Over Pre Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాడినికే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌నేత కె జానారెడ్డి విమర్శించారు. శుక్రవారం మీడియాతో ఆయన ముందస్తు ఎన్నికలపై స్పందించారు. తెలంగాణలో రాజకీయ అనిశ్చితి ఎక్కడుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ కలుషితానికి కేసీఆరే కారణమన్నారు. ఆయన ధోరణి ప్రజాస్వామ్యానికి చేటని మండిపడ్డారు.

అసలు కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకముందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌వే బఫున్‌ చర్యలని, అందితే కాళ్లు లేకుంటే జుట్టు పట్టుకునే రకమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. నెహ్రు కుటుంబంపై కేసీఆర్‌ వ్యాఖ్యలు బాధాకరమని, టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top