ప్రధానితో ముగిసిన కేసీఆర్‌ సమావేశం

CM KCR Meeting With Modi Has Ended On Saturday In Delhi - Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం సమావేశం అయ్యారు. లోక్‌కల్యాణ్‌ మార్గంలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ సుమారు 20 నిమిషాల పాటు సాగింది. ఈ సమావేశంలో 14 అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలిసింది. ముందస్తు ఎన్నికలు, నూతన జోన్లకు ఆమోదం, పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

అలాగే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, బీసీ రిజర్వేషన్‌ బిల్లు, రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయింపు, ఐఐఐటీ, ఐఐఎం మంజూరు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు తదితర అంశాలు సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిసింది.

సమావేశ సమయంలో ప్రధాని మోదీకి, సీఎం కేసీఆర్ వినతిపత్రం సమర్పించారు.వెనుకబడిన జిల్లాలకు వాయిదా కింద రూ.450 కోట్ల నిధులు విడుదల చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. తెలంగాణ రుణ పరిమితిని ఈ ఏడాది కూడా 0.50 పెంచాలని విజ్ఞప్తి చేశారు. వరుసగా నాలుగో ఏడాది కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు భారీ ఎత్తున ఖర్చుపెడుతున్నాం కనుక అప్పులు తీసుకునే అవకాశాన్ని పెంచాలని వినతి పత్రం ద్వారా కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top