
సాక్షి, అమరావతి: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి టీడీపీనే కారణమని సీఎం చంద్రబాబు చెప్పారు. గతంలో ఎన్టీఆర్ రూపొందించిన కాంగ్రెస్ వ్యతిరేక భావజాల పునాదులపైనే ఎన్డీఏ ఏర్పాటైందన్నారు.
మంగళవారం ఉండవల్లిలో తన నివాసం వద్ద జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. హోదా గురించి మాట్లాడుతున్న పవన్‌కు అసలు నిధులెన్ని వస్తాయో కూడా తెలియదన్నారు. అవిశ్వాన తీర్మానంపై అన్ని పార్టీల నేతలతో మాట్లాడి అందరి మద్దతు కొరతా నని సీఎం చెప్పారు. కాగా సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి తిరుమలకు కుటుంబంతో సహా చేరుకున్నారు. అన్నప్రసాద భవనంలో అన్నప్రసాద వితరణకు రూ.26 లక్షలు టీటీడీకి అందజేసినట్టు తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు.