‘మాణిక్యాలరావు గృహనిర్బంధం చట్ట విరుద్ధం’ | BJP Leaders Meet DGP For File Complaint Against AP Police | Sakshi
Sakshi News home page

Nov 8 2018 6:49 PM | Updated on Mar 28 2019 8:37 PM

BJP Leaders Meet DGP For File Complaint Against AP Police - Sakshi

సాక్షి, అమరావతి : బీజేపీ నేతలు పైడికొండల మాణిక్యాల రావు గృహ నిర్బంధం.. కన్నా లక్ష్మీ నారాయణ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ నాయకులు ఖండించారు. అనంతరం డీజీపీని కలిసి.. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సత్యమూర్తి విలేకరులతో మాట్లాడుతూ.. స్పీకర్‌ అనుమతి లేకుండా మాణిక్యాలరావుని గృహ నిర్బంధం చేయడం చట్ట విరుద్ధమన్నారు. దేశమంతా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటున్న సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారంటూ మండి పడ్డారు.

చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. బాబు చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తామని డీజీపీ హామీ ఇచ్చారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement