బీజేపీ కీలక భేటీ ప్రారంభం | bjp key meeting starts in vijayawada | Sakshi
Sakshi News home page

Feb 18 2018 11:43 AM | Updated on Feb 18 2018 12:33 PM

bjp key meeting starts in vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : విభజన హామీలపై ప్రజల ఆందోళన, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయవాడ హోటల్‌ ఐలాపురంలో బీజేపీ విస్తృతస్తాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ ఏపీ సీనియర్‌ నేతలు, అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చడం లేదని, రాష్ట్రానికి తగిన నిధులు ఇవ్వడం లేదని భాగస్వామ్య పక్షం టీడీపీ చేస్తున్న ఆరోపణలను దీటుగా ఎదుర్కోవడం, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో టీడీపీ నేతలు బీజేపీ లక్ష్యం చేస్తున్న విమర్శలకు దీటుగా కౌంటర్‌ ఇవ్వాలని కమల దళం నేతలు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement