
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి గిట్టుబాటు ధర లభించడం లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్ధం కావడం లేదని, రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆం దోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వం మెడలు వంచేందుకు 27న అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు పరిమితం కావద్దని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని వస్తున్న వార్తలపై తనకేమీ తెలియదని, రేవంత్ విషయాన్ని తనతో ఎవరూ చర్చించలేదని చెప్పారు.