టీడీపీకి బెజవాడ గోపాలకృష్ణ రాజీనామా | another shock to tdp: Bezawada gopala krishna to join ysrcp | Sakshi
Sakshi News home page

టీడీపీకి బెజవాడ గోపాలకృష్ణ రాజీనామా

Mar 10 2019 3:23 PM | Updated on Mar 10 2019 8:14 PM

another shock to tdp: Bezawada gopala krishna to join ysrcp - Sakshi

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ సమన్వయకర్త,

సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ సమన్వయకర్త, తెలుగు యువత మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెజవాడ గోపాలకృష్ణ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఆయనతో పాటు ఇద్దరు మాజీ సర్పంచులు, ఎంపీటీసీ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బెజవాడ గోపాలకృష్ణ మాట్లాడుతూ... టీడీపీని నమ్ముకున్నవారికి పార్టీలో తగిన గుర్తింపు లేదు. టీడీపీలో ఒకవర్గానికే ప్రాధాన్యత ఇస్తూ మరో వర్గాన్ని పట్టించుకోవడం లేదు. ఎక్కడ చూసినా పార్టీలో అవినీతే కనిపిస్తుంది. సోమవారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సుమారు మూడు వేలమందితో పార్టీలో చేరుతున్నాం. వైఎస్సార్‌ సీపీ కాకినాడ రూరల్‌ అభ్యర్థి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో 3000మందితో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement