నేడు జిల్లాకు అమిత్‌షా | Amit Shah Tour in Srikakulam And Vizianagaram | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు అమిత్‌షా

Feb 4 2019 10:09 AM | Updated on Feb 4 2019 10:09 AM

Amit Shah Tour in Srikakulam And Vizianagaram - Sakshi

శ్రీకాకుళం , కాశీబుగ్గ : కేంద్రం అమలు చేస్తున్న 126 సంక్షేమ పథకాలపై దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం పలాస రానున్నారని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం  కోట్లాది రూపాయలతో అనేక పథకాలు ప్రవేశపెడుతుంటే రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దోచుకుతింటున్నారని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు పలాస నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారని తెలిపారు. కాశీబుగ్గ బస్టాండ్‌ వద్ద ఉదయం బహిరంగ సభ అనంతరం బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, పార్టీ శ్రేణులంతా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement