ఆదివాసీలుగా గుర్తించండి

Identify As Tribals - Sakshi

దురువ సంప్రదాయ గిరిజనుల డిమాండ్‌

జయపురం: గిరిజనులైన తమను ఆదివాసీలుగా గుర్తించాలని జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితిలో ఉంటు న్న దురువ సంప్రదాయ ప్రజలు, సబ్‌కలెక్టర్‌ లోకనాథ్‌ దొలబెహరకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ మేరకు దురువ ఆదివాసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో జయపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహిం చారు.

ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను పలుపేర్లతో గుర్తించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను« దారువ, దురువ, ధురొవ తదితర పేర్లతో ప్రభుత్వం పరిగణిస్తోందని  ఆరోపించారు. జయపురం వనవాసి పరిశోధన కేంద్రం పరిశోధకులు గోవర్ధన పండా నివేదిక ప్రకారం ఇక్కడ దారువ, దురువ, దురొవ అనేవారు లేరని, కేవలం  దురువ సంప్రదాయ జాతివారు ఉన్నట్లు స్పష్టం చేశారని వినతి పత్రంలో వెల్లడించారు.

ఈ దురువ జాతిని 2011 జనాభా లెక్కల్లో ఆదివాసీ, హరిజన జాబితా 17వ పరుసలో చేర్చారన్నారు.   దురువ ప్రజలకు సొంత భాష ఉన్నప్పటికీ తమను ఆదివాసీలుగా గుర్తించడంలేదని వాపోయా రు. ఈ ఏడాది అనేక మంది దురువ జాతి విద్యార్థులను ఆదివాసీలుగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని హాస్టల్స్‌ నుంచి వెళ్లగొడుతున్నారని ఆందోళన వెలి బుచ్చారు.

అందువల్ల అటవీ భూమి పట్టాల ఆధారంగా దురువ విద్యార్థులను ఆదివాసీలుగా గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పట్టా ల ఆధారంగా తమను ఆదివాసీలుగా గుర్తించాలని డిమాం డ్‌ చేశారు. ఆందోళనలో దురువ ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు బుదయి దురువ, మహిళా నేతలు చక్రవర్తి దురువ, రాయిబలి దురువ, నీలావతి దురువ, మంగళదే యి దురువ, సువర్ణ దురువ తదితరులు పాల్గొన్నారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top