
ఐతరేయ ఉపనిషత్
ఐతరేయ మహర్షి దర్శించినది కావటం వల్ల అతని పేరనే ప్రసిద్ధమైన ఈ ఉపనిషత్తును ఋగ్వేద ఆరణ్య కం చివర చేర్చారు.
ఐతరేయ మహర్షి దర్శించినది కావటం వల్ల అతని పేరనే ప్రసిద్ధమైన ఈ ఉపనిషత్తును ఋగ్వేద ఆరణ్య కం చివర చేర్చారు. ఇందులో ఉన్న మూడు అధ్యా యాల్లో ముపై్ప మూడు మంత్రాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం ఇలా చెబుతుంది.
మొదట్లో భగవంతుడు తప్ప ఇంకేదీ లేదు. అప్పు డు ఆ భగవంతుడు అనుకొన్నాడు, ‘నేను లోకాలను సృష్టిస్తాను’ అని. అలా అనుకొని ఐదు లోకాలను సృష్టించాడు. తరువాత లోకపాలకులను సృష్టించా డు. అటు తరువాత నీటి నుంచి బ్రహ్మదేవుని రూపొం దించాడు. ఆ బ్రహ్మ దేవుని నుంచి విశ్వమూ, సమస్త జీవరాశులూ వచ్చాయి. ఆకలిదప్పులకు లోనైన జీవు లు సంసారమనే సముద్రంలో పడ్డారు. బ్రహ్మదేవుడు వాళ్లకు ఒక గోవును ఇచ్చాడు. ఇది మాకు చాలదు అన్నారు వాళ్లు. గుర్రాన్ని ఇచ్చాడు. చాలదు అన్నారు. తరువాత వాళ్లకి ఒక మనిషిని తెచ్చి ఇచ్చాడు. ‘‘ఈ మనిషి సరిగ్గా రూపొం దాడు’ అన్నారు వాళ్లు. అప్పుడు బ్రహ్మ దేవుడు వాళ్లతో ‘మీమీ స్థానాల్లో ప్రవే శించండి’ అని చెప్పాడు. అలా చెప్పిన మీదట అగ్ని వాక్కు అయి నోటిలో, వాయువు ప్రాణం అయి ముక్కులో, సూర్యుడు చూపు అయి కళ్లలో, దిక్కులు శబ్దం అయి చెవుల్లో, చెట్లు వెంట్రుకలు అయి చర్మంలో, చంద్రుడు మనస్సు అయి హృదయంలో, మృత్యువు అపానవాయువు అయి నాభిలో, నీరు రేత స్సు అయి పురుషాంగంలో ప్రవేశించాయి.
తరువాత బ్రహ్మదేవుడు ఆహారాన్ని సృష్టించాడు. అటు తరువాత మనిషి నడినెత్తిని చీల్చుకొని లోపలికి ప్రవేశించాడు. మనిషి ఆలోచన చేసిన తన శరీరం లోనే అంతటా వ్యాపించి భగవంతుడు ఉండటం కను గొన్నాడు. ఇలా మొదటి అధ్యాయం పూర్తవుతుంది.
రెండవ అధ్యాయంలో ప్రాణం ఎలా రూపొందు తుందో మనిషికి ఉన్న మూడు జన్మలు ఏవో వివరిం చారు. మొదట్లో మనిషి రేతస్సుగా ఉంటాడు. అన్ని అవయవాల శక్తి కలసి రేతస్సుగా అవుతుంది. పురు షుడు తన రేతస్సును స్త్రీలో ప్రవేశపెడతాడు. ఇది అతడి మొదటి జన్మ. ప్రాణంతో ఉన్న రేతస్సును స్త్రీ తన గర్భంలో ధరించి పోషిస్తుంది. తల్లి గర్భం నుంచి బిడ్డగా జన్మించటం అతడి రెండవ జన్మ. పుట్టిన కుమారుడు సత్కర్మలు చేయటానికి నియమితుడ య్యాడు. తండ్రి ముసలివాడయి, దేహం నుండి విడి వడి మళ్లీ పుడతాడు. ఇది అతడి మూడవ జన్మ.
మూడవ అధ్యాయంలో ఆత్మ విచారణ చేశారు. ఎవరి వలన మనం చూస్తున్నామో, వింటున్నామో, వా సన చూస్తున్నామో, మాట్లాడుతున్నామో, రుచి చూస్తు న్నామో ఆయనే ఆత్మ. సర్వమూ ఆత్మే. సమస్తానికీ ఆధారం ఆత్మే. ఇట్లా ఆత్మను తెలుసుకొన్న వ్యక్తి శరీ రం నశించగానే స్వర్గానికి వెళ్లి అమరత్వ సిద్ధిని పొం దుతాడని ఉపనిషత్తు ముగింపు వాక్యం పలుకుతుంది. నాలుగు మహాకావ్యాల్లో ఒకటైన ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ను ఈ ఉపనిషత్తు నుంచే గ్రహించడమైనది.
దీవి సుబ్బారావు