
డల్లాస్: కాశ్మీర్‌లోని పుల్వామా వద్ద ముష్కరుల దాడికి నిరసనగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నారు. శనివారం సాయంత్రం 5.00 గంటలకు వీర మరణం పొందిన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నట్లు ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ సభ్యులు తెలిపారు. ఈ ర్యాలీకి భారీ ఎత్తున ప్రజలు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించాలని ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ ఫౌండర్ డా. ప్రసాద్ తోటకూర కోరారు. మరింత సమాచారం కోసం www.mgmnt.orgకు లాగిన్ కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో