
ఆస్టిన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ వేడుకలు ఆస్టిన్, టెక్సాస్‌లో ఘనంగా జరిగాయి. రాక్ ఎన్ గ్రిల్‌లో జరిగిన ఈ వేడుకలకు వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి ఆవుల, శ్రీ కొత్తపల్లి, కొండా రెడ్డి ద్వారసల, అశోక్ రెడ్డి గూడూరు, కుమార్ అశ్వపతి, నారాయణ రెడ్డి గండ్ర, కరుణ్ రెడ్డిలు ప్రసంగించారు. వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, నవరత్న పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. అలాగే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయభేరి మోగిస్తుందని, ఈ శ్రీరామనవమితో ఆంధ్రాలో దుష్ట రాక్షస పాలన ముగిసి రామరాజ్యం రాబోతోందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆస్టిన్ అభిమానులు పలు సామజిక సేవా కార్యక్రమాలతో సమాజానికి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హేమంత్ బల్ల, ప్రవర్ధన్ చిమ్ముల, రఘు జడల, విఠల్ రెడ్డి, రాంమోహన్ అరికూటి, ఆసిఫ్, శివ ఎర్రగుడి, కేదార్, అనంత్, రమణా రెడ్డి, శ్రీని కొత్త, సుబ్బా రెడ్డి వైఎస్‌ఆర్, వెంకట్‌లతో పాటూ పలువురు పాల్గొని జయప్రదం చేశారు.