డెట్రాయిట్లో నాట్స్ ఫ్రీ ట్యాక్స్ సెమినార్

NATS Conducts Free tax seminar in Detroit - Sakshi - Sakshi

ఎస్టేట్ ప్లానింగ్ తదితర ఆర్థిక అంశాలపైన అవగాహన కల్పించిన నాట్స్

డెట్రాయిట్‌ : అమెరికాలో ఉంటున్న తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఫ్రీ ట్యాక్స్ సెమినార్, ఎస్టేట్ ప్లానింగ్ (ఫైనాన్సియల్ ప్లానింగ్) సెషన్ నిర్వహించింది. స్థానిక ఐలాండ్ లేక్స్ అఫ్ నోవి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన ఈ సెమినార్కి మంచి స్పందన వచ్చింది. ప్రముఖ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటింగ్ నిపుణులు హస్ముఖ్ పటేల్ సెమినార్లో వివిధ అంశాలపైన అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ఫెడరల్, స్టేట్ టాక్సులు, 1040 కి 1040-ఎన్‌ఆర్‌ కి మధ్య తేడా, ఎఫ్‌బీఏఆర్‌ దాఖలు, ఇతర పన్ను మినహాయింపులపై వచ్చిన ప్రశ్నలకి హస్ముఖ్ పటేల్ సమాధానాలు ఇచ్చారు. ట్యాక్స్ సెమినార్ తరువాత ఫైనాన్షియల్ ప్లానింగ్ సెషన్ జరిగింది. ఎస్టేట్ ప్లానింగ్ లో నిపుణుడైన ప్రముఖ న్యాయవాది గ్యారీ మ్యేర్స్, విల్ రిజిస్ట్రేషన్, ట్రస్ట్ రిజిస్ట్రేషన్, ప్రొబేట్, లివింగ్ విల్స్, రియల్ ఎస్టేట్ తదితర అంశాలపైన సెమినార్‌కు హాజరైన వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
 
నాట్స్ డెట్రాయిట్ చాప్టర్ ప్రెసిడెంట్ కిశోర్‌ తమ్మినీడి, ప్రసాద్ గొంది, గౌతమ్ మార్నేని, శ్రీని కొడాలి, శివ అడుసుమిల్లి, దత్త సిరిగిరి, నాగ సతీష్ కంచర్ల, శ్రీధర్ అట్లూరి తదితర నాట్స్ నాయకుల సహకారంతో జరిగిన ఈ సెమినార్ని నాట్స్ నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్ కృష్ణ కొత్తపల్లి ఈవెంట్ని ముందుండి ఆసక్తికరంగా నడిపించారు. హస్ముఖ్ పటేల్, గ్యారీ మ్యేర్స్ లను సామ్ బొల్లినేని, శైలజ కోడాలి సత్కరించారు. రవి నూతలపాటి, వేణు కొడాలి, చలపతి కోడూరి, శ్రీనివాస్ చిత్తలూరి, శ్రీనివాస్ పిన్నమనేని, మహీధర్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. నాట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 24 గంటల హెల్ప్ లైన్ సర్వీస్, స్కూళ్లను దత్తత తీసుకోవడం, దేశవ్యాప్తంగా నాట్స్ చేయబోయే వివిధ కార్యక్రమాలను కృష్ణ కొత్తపల్లి వివరించారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ సూరపనేని బసవేంద్ర కార్యక్రమాన్ని వియజవంతంగా నిర్వహించిన డెట్రాయిట్ నాట్స్ నాయకులను అభినందించారు. నాట్స్ కు మద్దతుగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సెమినార్కి వచ్చినవారంతా అభినందించారు. పన్ను చెల్లింపులు, మినహాయింపులు, ఆర్థిక వ్యవహారాలపైన అవగాహన .. ఆర్థిక సందేహాల నివృత్తికి ఈ సెమినార్ ఎంతగానో దోహదపడిందన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top