లండన్‌లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

Jayashankar Birth Anniversary celebrations held in London - Sakshi

లండన్‌ : ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలని లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  యూకే నలుమూలల నుండి తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వచ్చారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ యూకే ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు ఆధ్వర్యంలో, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా జయశంకర్ చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. జయశంకర్‌, అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పని చేశారని తెలిపారు. అటువంటిది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయిన సంతోష సందర్భంలో ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనకై జయశంకర్ చేసిన కృషిని ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు అన్ని ఆచార్య జయశంకర్‌ మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు. జయశంకర్ కలలు కన్న తెలంగాణ కేవలం కేసిఆర్ నాయకత్వంతోనే సాధ్యమని, అన్ని సందర్భాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని, కేసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, మాజీ అధ్యక్షుడు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, అడ్వైజరీ బోర్డు వైస్ ఛైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్, కార్యదర్శులు హరి నవాపేట్, సత్య చిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి, లండన్ ఇంచార్జిలు గణేష్ పాస్తం, భాస్కర్ మొట్టా, ఈస్ట్ లండన్ ఇంచార్జ్  ప్రశాంత్ కటికనేని, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రామ్ కలకుంట్లతో పాటు తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బలమూరి, జాగృతి యూరోప్ అధ్యక్షుడు సంపత్ ధన్నమనేని, టీ.డీ.ఎఫ్ అధ్యక్షుడు పింగళి శ్రీనివాస్ రెడ్డితో పాటు వారి ప్రతినిధులు, స్థానిక తెలంగాణ వాదులు కిషోర్ మునగాల తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top