డెట్రాయిట్‌లో ఆటా బోర్డు మీటింగ్‌

ATA Board meeting held in Detroit - Sakshi

డెట్రాయిట్‌ : అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) బోర్డు మీటింగ్‌ డెట్రాయిట్‌లోని సౌత్‌ఫీల్డ్ మారియట్‌ హోటల్‌లో జరిగింది. అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆటా ట్రస్టీలు, అడ్వైజర్లు, రీజినల్‌ కో ఆర్డినేటర్లు, వివిధ స్టాండింగ్‌ కమిటీ అధ్యక్షులతోపాటూ స్థానిక ఆటా సభ్యలు పాల్గొన్నారు. డెట్రాయిట్‌ ఆటా టీమ్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రస్టీలు హరి లింగాల, మురళి బొమ్మనవేణి, అంతర్జాతీయ కో ఆర్డినేటర్‌ కోత కాశి, రీజినల్‌ అడ్వైజర్‌ సన్నీ రెడ్డి, సీఎమ్‌ఈ అధ్యక్షులు డా. అశోక్‌ కొండూరు, డా. హర్ష క్రిష్ణ, ఆర్సీలు చెంచురెడ్డి, సునీల్‌ మందుటి, ఎస్‌సీ అధ్యక్షులు వేణు సురపరాజులు ఆటా బోర్డు మీటింగ్‌ పనులను పర్యవేక్షించారు. త్వరలో రాబోయే ట్రస్టీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్‌ కమిటీ, ఎలక్షన్‌ కమిటీల నియామకాలను ఆటా నాయకులు చేపట్టారు. అమెరికాలోని తెలుగువారికి మరిన్ని సేవలు అందించడానికి చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. 

ఆటా వ్యవస్థాపక సభ్యులు, మాజీ అధ్యక్షులు హనుమంత్‌ రెడ్డి, ఆటా అధ్యక్షులు కరుణాకర్‌ ఆసిరెడ్డి, ఆటా ఎలక్ట్‌ ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీమ్‌రెడ్డిలు ఆటా వివాహ పరిచయవేదిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. మాట్రిమోనియల్‌ కమిటీ సభ్యులు శంకర్‌ బండి, రామ క్రిష్ణా రెడ్డి ఆళ్ల, అజయ్‌ రెడ్డి, అనిల్‌ బోడిరెడ్డి, అరుంధతి కోడూరులు చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు డెట్రాయిల్‌ ఆటా టీమ్‌కు ఆటా బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. లాస్‌ వేగాస్‌లో 2019 జనవరిలో ఆటా మరుసటి బోర్టు మీటింగ్‌ జరగనుంది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top